This is moving text Moving Right to Left

announcement

omshanti

సుమంగళీ గుర్తులు

 

బాప్ దాదా పిల్లల సుమంగళీతనమును వారి భాగ్యమును చూస్తూన్నారు. సుమంగళీతనమునకు గుర్తు తిలకము,భాగ్యమునకు గుర్తు ప్రకాశ కిరీటములను చూస్తున్నారు. సదా సుమంగళీకి గుర్తు అవినాశి స్మృతి అను తిలకము సదా భాగ్యమునకు గుర్తు పవిత్రత. మెరుస్తున్న తిలకము సదా తండ్రి జతలో ఉండు సుమంగళీతనమునకు గుర్తు. ఇటువంటి సుమంగళీ తిలకమును ధరించినవారు లేదా సుమంగళీగా ఉండువారు విశ్వము ముందు శ్రేష్ట్హముగా అనగా శ్రేష్ఠ ఆత్మగా కనిపిస్తారు. అలౌకిక జీవితములో ప్రతి ఆత్మ ఒకే ప్రియునికి ప్రేయసి అనగా సుమంగళీ.
సదా సుమంగళీ అనగా ఒక్క శ్వాస లేక ఒక్క క్షణము కూడా ప్రియుని తోడును వదిలిపెట్టదు. సదా సుమంగళీగా ఉండువారు మనస్ఫూర్తిగా మీ జతలో ఉంటాను, జతలోనే జీవిస్తాను, జతలోనే మరణిస్తాను అంటూ సుమంగళీ కనులలో, ముఖములో ప్రియుని ముఖము మరియు వ్యక్తిత్వము(గుణాలు) ఇమిడి ఉంటాయి. సుమంగళీ చెవులు సదా ప్రియుని మాటలే వినాలని ఉంటాయి. సదా సుమంగళీ అనగా వారి చెవులలో సదా అనాది మహామంత్రమైన మన్మానభవ అను స్వరము మ్రోగుతూ ఉంటుంది. ఇతర ఏ ఆత్మల మాటలు వినిపిస్తున్నా వినరు. ఇటువంటి స్థితి సదా సుమంగళీకి మాత్రమే ఉంటుంది.సదా సుమంగళీ ఆత్మ సంకల్పములో కూడా ఇతర ఆత్మలను ఒక్ సెకెన్ కూడా స్మృతి చేయదు. అనగా ఏ దేహాధారిని గురించి సంకల్పము కూడా చేయదు(ఝకావ్ ఉండదు). అనుభందము అనునది పెద్ద మాట, ఝకావ్ కూడా ఉండదు. సదా సుమంగళీ అంటే ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేనివారు. భాగ్యశాలీ కిరీటమునకు ఆధారం- పవిత్రత మరియు సర్వ ప్రాప్తులు. సంపూర్ణ పవిత్రత అనగా మనసులో కూడా ఏ ఒక్క వికారము అంశ మాత్రము కూడా ఉండరాదు. సర్వ ప్రాప్తులు అనగా జ్ఝానము, సర్వ గుణాలు, సర్వ శక్తుల ప్రాప్తి. ఏ ఒక్క ప్రాప్తి తక్కువ ఉన్నా ప్రకాశ కిరీటము స్పష్ఠముగా కనిపించదు.
సదా సుమంగళీ తిలకమును ధరించిన శ్రేష్ఠ భాగ్యశాలురు, సర్వ ప్రాప్తి స్వరూపులు, సదా తండ్రి జతలో ఉండువారు, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యాదుప్యారు మరియు నమస్తే. అచ్చా ఓం శాంతి.  

No comments:

Post a Comment