This is moving text Moving Right to Left

announcement

omshanti

ee Vaaram MURALI MERUPULU


·         వార్త పత్రిక చదువుతున్న సమయంలో కూడా మేము అందరికీ ఎలా సందేశము తెలియజేయాలి అనే ఆలోచన రావాలి. ఈ బ్రహ్మ శివబాబా ఉన్న సంచి. ఇవి చాలా రమణీయమైన విషయాలు. బౌద్దులుగా,క్రైస్తవులుగా, ముసల్మానులుగా చాలా మంది కన్వర్ట్ అయిపోయారు. అందువలన సంఖ్య తగ్గిపోయింది.
·         ఎవరైతే బాగా ధారణ చేసి ఇతరులతో చేయిస్తారో ప్రజలను తయారు చేస్తారో వారే మంచి పదవి పొందగలరు.
·         సూక్ష్మవతన వాసీ బ్రహ్మకు రాత్రి పగలు ఉండవు. అతను సూక్ష్మవతన వాసీ. ఈ విషయాలన్ని బుద్దిలో ఉంటే ఎంత ఖుషీ ఉంటుంది.
·         మొదట ఇచ్చట (మురళీ క్లాసు) చెప్పిన దానిని రిపీట్ చెయండి అనగా వల్లె వేయండి. పదే పదే రిపీట్ చేస్తే అప్పుడు మీరు ఎక్కడైనా తెలియజేయగలరు. మంచి మంచి ఫస్ట్ క్లాస్  పాయింట్స్  వస్తాయి.
·         తండ్రిని తలంపు చేయనందున బుద్దికి వేయబడిన తాళం తెరవబడదు. ఎవరు నన్ను స్మృతి చేయరో వారిలో ధారణ జరగదు. బుద్దికి వేయబడిన తాళము ఎలా తెరవబడాలి? ఒక్క బాబా తలంపు ద్వారానే తెరవబడాలి.
·         తండ్రి చెప్తున్నారు- నేను నిరహంకారిని, మీకు ఇంత అహంకారము ఎందుకు వస్తుంది? నేనే తెలివివంతుడును అని భావిస్తారు. మీకు ఇంత దేహాభిమానము వచ్చేస్తుంది.
·         సాక్షాత్కారపు తాళం చెవి ఒక్క తండ్రి చేతిలో మాత్రమే ఉన్నది. ఈ సాక్షాత్కారాల విషయము కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉన్నది. డ్రామాను మంచి రీతీగా అర్దం చేసుకోవాలి.
·         అరే బాబా పై మంచి రీతీగా గౌరవముంచండి. చాలామంది ఇలా కూడా కోతలు కోస్తారు- మాకు బాబాపై చాలా ప్రేమ ఉన్నది. మేము ఇన్ని గంటలు బాబాను తలంపు చేస్తున్నామని అంటారు. బాబా(బ్రహ్మ) చెప్తున్నారు- నేను కూడా పూర్తిగా తలంపు చేయలేకున్నాను. బాబాకు అపూరూపబిడ్డను. అయినను నేను చాలా పురుషార్దం చేస్తున్నాను.
·         ఎ వ్యక్తి వైపు గాని, వస్తువు వైపు గాని ఆకర్షణ ఉండరాదు. ఇటువంటి రాజ్య అదికారీ పిల్లలే తపస్వీలు. వారే హంసలు. కొద్దిగా కూడా ప్రాపంఛిక వైబ్రేషన్లు వారిని ఆకర్షించవు. వారికి ఏ పిర్యాదులు ఉండవు. వారి పిర్యదులన్ని సమాప్తమైపోతాయి.