This is moving text Moving Right to Left

announcement

omshanti

Pyramid - Meditation

"పిరమిడ్ ధ్యానుల ఆదర్శ సూత్రాలు"
  1. సరియైన ధ్యానం .. "ఆనాపానసతి"ని .. క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం; అదే ఆనాపానసతి ధ్యానాన్ని అందరిచేతా చేయించడం; విశేషమైన ఆసనాలు, క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏ మాత్రమూ లేవు
  2. నూటికి నూరు పాళ్ళు సరియైన ఆత్మవిజ్ఞానాన్ని అందించే పుస్తకాలను .. ఉదా:- స్వామీ రామా, యోగానంద పరమహంస, ఓషో, లిండా గుడ్‍మాన్, ఎక్కిరాల కృష్ణమాచార్య, డోరీన్ వర్చ్యూ, అనీబిసెంట్, దీపక్ చోప్రా .. ఇత్యాది గ్రాండ్ మాస్టర్ల గ్రంధాలను అధ్యయనం చేయడం
  3. ధ్యానంలో వచ్చే అనుభవాలను పిరమిడ్ మాస్టర్లతో పంచుకోవడం; అలాగే తోటి ధ్యానుల ధ్యానానుభవాలనూ శ్రద్ధగా వినడం
  4. వీలయినంత వరకు మౌనాన్ని అలవరచుకోవడం; ప్రాపంచికపరమైన పితూరీలు సంపూర్ణంగా నిషిద్ధం
  5. పౌర్ణమి ధ్యానం తప్పనిసరి .. ముఖ్యంగా సామూహికంగా పౌర్ణమి ధ్యానాలు చేయడం
  6. ధ్యానానికి పిరమిడ్ శక్తిని విశేషంగా వినియోగించుకోవడం; ప్రతి ఇంటా పిరమిడ్‌లు ఏర్పాటుచేసుకోవడం
  7. అల్లోపతి మందులను పూర్తిగా మానేయడం; అల్లోపతి డాక్టర్లను మర్చిపోవడం; ధ్యానాన్నే శరణు వేడుకోవడం
  8. మాంసాహారాన్ని.. కోడిగ్రుడ్లతో సహా .. సంపూర్ణంగా .. విసర్జించడం; సర్వవేళలా పరిమితాహారమే యుక్తం
  9. ప్రకృతితో సహజీవనం గడుపుతూ ఉండడం; ఇతోధికంగా అడవుల్లో ట్రెక్కింగులు చేస్తూండడం
  10. ప్రత్యేక ”ఆధ్యాత్మిక వేషధారణ” ఉండకపోవడం; వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవడం
  11. చిన్ననాటి నుంచే పిల్లలకు తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానంలో శిక్షణ ఇవ్వడం
  12. ప్రతి ఒక్కళ్ళూ గురువులుగా తయారుకావడం; 'శిష్యులు'గా కాక 'మాస్టర్స్'గా విరాజిల్లడం
  13. ధ్యానశిక్షణా కార్యక్రమాలలో పైకం తీసుకోకపోవడం; గురువు శిష్యుల మధ్య వుండేది కేవలం స్నేహతత్వమే
  14. విగ్రహారాధన కాకుండా సత్యారాధనకే అంకితం కావడం; దేవాలయాలను ధ్యానసాధనాలయాలుగా మార్చడం
  15. స్వీయ ధ్యానశక్తితోనే, ఎవరి జీవిత సమస్యలను వారే, క్రమక్రమంగా పరిష్కరించుకోవడం
  16. సాధారణ వృత్తులతో సంతృప్తి చెందుతూ గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా, ఆత్మజ్ఞానయుతంగా గడపడం
  17. అన్ని గ్రామాలాలోనూ, అన్ని పట్టణాలలోనూ, అన్ని నగరాలలోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాలను నెలకొల్పడం
  18. స్వీయధ్యానానుభవాలనూ, స్వీయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలనూ పుస్తకాల రూపాలలో ప్రచురించడం
    courtesy:Brahmarshi Patriji Pyramid Meditation

No comments:

Post a Comment